ఎడారిలా మంజీరా | - | Sakshi
Sakshi News home page

ఎడారిలా మంజీరా

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సంగారెడ్డి టౌన్‌: అన్ని కాలాల్లో ప్రజల దాహార్తి తీర్చిన మంజీరా నది ప్రస్తుతం వట్టిపోయింది. వర్షాలు లేక ప్రాజెక్ట్‌లోకి నీళ్లు రాకపోవడంతో అక్టోబర్‌లోనే మంజీరా పూర్తిగా ఎండిపోయి తాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదమేర్పడింది. సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌ మంజీరా డ్యామ్‌ ప్రస్తుతం నీళ్లు లేక నెర్రలు బారి దర్శనమిస్తోంది. అక్టోబర్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు తాగునీటి కష్టాలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీళ్లు మొత్తం అడుగంటి పోగా పశుగ్రాసానికి సైతం కొరత ఏర్పడింది. అధికారులు ముందస్తుగా స్పందించి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తప్ప ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement