నీటి పొదుపేదీ? | - | Sakshi
Sakshi News home page

నీటి పొదుపేదీ?

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులనెదుర్కొంటున్నామని ఫలితంగా తాగునీటికి ఇబ్బందులు తప్పవని నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రచారంతో ఊదరగొడుతోంది. మరోవైపు రోడ్లపై పైప్‌లైన్లు పగిలి విలువైన నీరు వృథాగా పారుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. పట్టణంలోని భవాని మందిర్‌ వెనుక రోడ్డుపై తాగునీటి పైప్‌లైన్‌పగిలి ఇదిగో ఇలా వృథాగా పోతోంది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇలా వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ ట్యాంకర్లపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అధికారులు తక్షణమే స్పందించి పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని, నీటి వథాను అరికట్టి తాగునీటిని పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement