సీఐటీయూ మానిక్
పటాన్చెరు టౌన్: పాశమైలారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మానిక్ ఆరోపించారు. పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ...మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ కార్మికులను తొలగిస్తూ రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి చట్టం ప్రకారం రావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతూ వారి పొట్ట కొడుతున్న మైలాన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యుడు రాజు నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.


