రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మరో ముగ్గురు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మరో ముగ్గురు

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండలంలోని పలు పాఠశాలలకు చెందిన ముగ్గురు బాలికలు కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, తాజాగా మరో ముగ్గురు బాలురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌ 14 బాలికల విభాగంలో కబడ్డీ పోటీల్లో న్యాల్‌కల్‌లోని ఆయా పాఠశాలలకు చెందిన ముగ్గురు బాలికలు ఎంపికై న విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన అండర్‌ 17 బాలుర విభాగంలో న్యాల్‌కల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన గణేశ్‌, మెటల్‌కుంట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ప్రదీప్‌, నవీన్‌ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయా పాఠశాలల పీడీ, పీఈటీలు తెలిపారు. మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement