తహసీల్దార్‌ దురుసు వ్యాఖ్యలు | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ దురుసు వ్యాఖ్యలు

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సిద్దిపేటరూరల్‌: బండచెర్లపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి గురించి గోడు వెల్లబోసుకుంటున్న క్రమంలో రూరల్‌ మండల తహసీల్దార్‌ దుర్భాషలాడుతూ దురుసుగా మాట్లాడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బండచెర్లపల్లికి చెందిన రంజిత్‌ కుమార్‌ తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయమై గ్రామానికి వచ్చిన తహసీల్దార్‌ రెహమన్‌ను కలిశారు. ఇల్లుకట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని అడగ్గా.. అసహనం వ్యక్తం చేసిన తహసీల్దార్‌ దురుసుగా సమాధానం ఇవ్వడంతో సంభాషణ ఉద్రిక్తంగా మారింది. ప్రజలకు గౌరవంగా సమాధానం ఇవ్వాల్సిన అధికారి ఇలా దురుసుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తహసీల్దార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తన వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వ భూమిలో అనుమతులు ఇవ్వరాదని రంజిత్‌కు తెలిపానని, వారి వద్ద ఉన్న పట్టాపత్రాలను చూపాలని చెప్పినా చూపడం లేదన్నారు. ఊతపదం మాదిరిగానే మాట్లాడాను కాని ఎలాంటి దురుద్ధేశంతో మాట్లాడలేని వివరణ ఇచ్చారు.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి: బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement