నంగునూరు(సిద్దిపేట): విద్యార్థి దశలో తీసుకున్న నిర్ణయం జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుందని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, మోటివేషన్ స్పీకర్ డాక్టర్ శ్రీకాంత్, ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ స్పీకర్ శ్రీనివాస్ అన్నారు. అక్కేనపల్లి మాడల్‌స్కూల్‌లో బుధవారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సైబర్ నేరాలు, మోబైల్ ఫోన్ వినియోగంపై మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. నైతిక విలువలు పాటిస్తూ భవిషత్తులో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. చదువుకునే వయసులో మోబైల్ ఫోన్‌కు బానీసలు కాకుండా విజ్ఞానాన్ని తెలియజేసే కార్యక్రమాల కోసం వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానయ్య, అధ్యాపకులు శ్రీనివాస్, రజని, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్, సుధాకర్, నర్సయ్య, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


