చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

హత్నూర(సంగారెడ్డి): బాలికలు సైతం చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సంగారెడ్డి జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ బాలికల వాలీబాల్‌ పోటీలను ఎమ్మెల్యే క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల నుంచి 758 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొనడం శుభసూచికమన్నారు. 758 మందిలో రాష్ట్రస్థాయికి నలుగురిని మాత్రమే ఎంపిక చేస్తారని వారు జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తారని సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులను కోరారు. గ్రామాలలో ప్రస్తుతం యువతీ, యువకుల కోసం గ్రంథాలయాలు.. క్రీడలు ఆడేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తే యువత చెడు వ్యసనాలకు బానిస కారన్నారు. రెండు రోజులు పాటు జరిగే జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలలో స్నేహపూర్వకంగా పాల్గొనాలని ఎమ్మెల్యే క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలలో జిల్లా క్రీడా పోటీల కన్వీనర్‌ శ్రీనివాస్‌, ఎంఈఓ వెంకట్‌ నరసింహ గౌడ్‌, పాఠశాల హెచ్‌ఎం ఉమారాణి, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఉపసర్పంచ్‌ శేఖర్గౌడ్‌, సర్పంచులు శ్రీహరి, ఎల్లయ్య, బీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement