వ్యభిచార ముఠా గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హుస్నాబాద్‌: పోలీసులు తనిఖీలు చేపట్టి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మంగళవారం ఏసీపీ సదానందం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని కరీంనగర్‌ రోడ్డులో నిర్వాహకురాలు వేరే ప్రాంతం నుంచి ఓ యువతిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోందని తెలిపారు. సీఐ శ్రీధర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి, నిర్వాహకురాలితోపాటు అక్కన్నపేటకు చెందిన విటుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. గతంలోనూ కౌన్సిలింగ్‌ ఇచ్చి గౌరవప్రదంగా బతకాలని చెప్పినా నిరాకరించిందని ఏసీపీ తెలిపారు. సీపీ సూచనల మేరకు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారితో మాట్లాడి వ్యభిచార వృత్తిని మానితే ఉద్యోగ అవకాశాలు, స్వయం వృద్ధి పథకాలు ఇప్పిస్తామని మంచి మార్గం ఎంచుకోవాలని సూచించారు. అయినా వినకుండా అదే వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు.

కేసు నమోదు

వివరాలు వెల్లడించిన ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement