దుబ్బాక: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజు వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామానికి చెందిన కొక్కిరాల నాగారావు (80) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బావి మోటారు చెడిపోవడంతో రిపేరు చేయించేందుకు ఎలక్ట్రిక్ బైక్‌పై దుబ్బాకకు తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని చీకోడ్ మార్గంలో నాగారావు బైకును దుబ్బాక నుంచి చీకోడ్ వైపు చైన్ హార్వెస్టర్‌ను తీసుకొస్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి మనవడు రోహిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు డీసీఎం డ్రైవర్ మహేందర్‌పై కేసు నమోదు చేశారు.


