ఆగిన చౌరస్తాల పనులు! | - | Sakshi
Sakshi News home page

ఆగిన చౌరస్తాల పనులు!

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

ఆగిన చౌరస్తాల పనులు!

జాతీయ రహదారి పనుల నేపథ్యంలో వివిధ కారణాలతో పలు ప్రాంతాల్లో ఉన్న చౌరస్తాలను విస్తరించే పనులకు బ్రేక్‌లు పడ్డాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌, హుస్నాబాద్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తా, కోహెడ మండలంలోని బస్వాపూర్‌, ముండ్రాయి చౌరస్తాల మధ్య మహనీయుల విగ్రహాలు ఉండటంతో ఇప్పటి వరకు పనులు ముట్టలేదు. చౌరస్తాల వరకు వచ్చే వరకు రహదారి ఇరుకుగా ఉంటుంది. అలాగే హుస్నాబాద్‌ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. చౌరస్తాల మధ్య మహనీయుల విగ్రహాలు ఉండటంతో అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారనే చర్చ జరుగుతుంది. గతంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని చౌరస్తా విస్తరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కానీ ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా మిగిలాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement