ఎనిమిది మంది అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): సూరారం గ్రామంలో గుప్త నిధుల కోసం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం... వెల్దుర్తి మండలం రామాయంపల్లి సర్పంచ్ భర్త మహేందర్, హైదరాబాద్‌కు చెందిన రంగస్వామి, చందానగర్‌కు చెందిన ఆవుసుల బ్రహ్మచారి, వివేక్, సూరారం గ్రామానికి చెందిన తుడుం కిష్టయ్య, వంగాల బ్రహ్మచారి, శ్రీనాథ్, కాగుల కిషన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి తదుపరి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే వీడియో కాల్లో తాంత్రిక పూజారి మంత్రాలు చదవగా, ఇక్కడ ఉన్నవారు నగ్నంగా పూజలు నిర్వహిస్తూ గ్రామస్తులకు దొరికిపోయారు. గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


