యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

దుబ్బాకటౌన్‌: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ సూచించారు. మంగళవారం దౌల్తాబాద్‌ మండలంలోని ఇందుప్రియాల్‌ గ్రామంలో నిర్వహించిన ‘మన పోలీస్‌–మన ఊరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల, గ్రంథాలయం గోడలపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనలు, డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన చిత్రాలను పరిశీలించారు. విద్యార్థులు నిర్వహించిన ట్రాఫిక్‌ భద్రత, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై రంగోలి పోటీలను తిలకించి అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌కుశాల్కర్‌, అదనపు డీసీపీ ఏఆర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు, తొగుట సీఐ శ్రీను, ఇన్‌స్పెక్టర్‌ లతీఫ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ విష్ణు ప్రసాద్‌, దౌల్తాబాద్‌ ఎస్సై అరుణ్‌, ఎస్సైలు నవీన్‌, బాలకృష్ణ, రేణుక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సీపీ రష్మీ పెరుమాళ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement