బెజ్జంకి(సిద్దిపేట): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామాల్లో ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండలంలోని రేగులపల్లె, చిలాపూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల అధికారులతో కలిసి ఆయా గ్రామాల్లోని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేగులపల్లెలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ ప్రవీణ్, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, ఏపీఎం పరశురాములు, ఏఓ సంతోష్, ఏఈలు మహేష్, అనిత, వైస్ చైర్మన్ సంతోష్, సర్పంచ్‌లు లక్ష్మి, స్వరూప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.


