రెండు నెలల్లో పూర్తి చేస్తాం
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా మిట్టపల్లి వరకు 63 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి పనులు చేపట్టారు. 31 బ్రిడ్జిలు, 88 కల్వర్టులు పూర్తి చేశారు. రహదారి పనులు తుది దశకు చేరుకున్నా.. కొన్ని చోట్ల చివరి వరుస తారు పనులు చేయాల్సి ఉంది. హైవే రోడ్డులోని కోహెడ మండలం నాగసముద్రాల పరిధిలో లక్ష్మిపూర్ కల్వర్టు నుంచి గండిమైసమ్మ ఆలయం వరకు వచ్చేసరికి రోడ్డు పనులు నిలిచిపోయాయి. వరంగల్, సిద్దిపేటకు ప్రధాన రహదారి కావడంతో రోజు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో అటవీ భూముల సమస్య, భూ సేకరణ సమస్యలతో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. అలాగే హుస్నాబాద్ మండలం పందిల్ల శివారులో టోల్‌గేట్ ఏర్పాటు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ పక్క నుంచి వేసిన మట్టి రోడ్డు నుంచే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
రెండు నెలల్లో సమస్యలను పరిష్కరించి జాతీయ రహదారి పనులు పూర్తి చేస్తాం. చౌరస్తాల మధ్య ఉన్న విగ్రహాల విషయంలో స్థానిక సర్పంచ్‌లు, మున్సిపల్ అధికారులతో చర్చించాం. త్వరలోనే విగ్రహాల విషయంపై స్పష్టత రాగానే చౌరస్తా విస్తరణ పనులు ప్రారంభిస్తాం. అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్న చివరి వరుస తారు పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 31 వరకు సంబంధిత కాంట్రాక్టర్ రహదారి పనులు పూర్తి చేయాల్సి ఉంది.
– ప్రశాంత్, ఏఈఈ,
జాతీయ రహదారుల శాఖ.
పలు చోట్ల నిలిచిన విస్తరణ పనులు
జాతీయ రహదారి పనుల్లో భాగంగా పలు చోట్ల భూ సేకరణ సమస్యలతోపాటు, చౌరస్తాల వద్ద రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల తారు పనులు పెండింగులో ఉన్నాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైవే పనులు పూర్తి కాని పరిస్థితి నెలకొంది. – హుస్నాబాద్
చౌరస్తా విస్తరణ పనులకు అడ్డంకులు
పలు చోట్ల భూసేకరణ సమస్యలు
కొన్ని చోట్ల తారు పనులు పెండింగ్
డెడ్‌లైన్ డిసెంబర్ 31


