సంగారెడ్డి: గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, ఎకై ్సజ్ అధికారులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామ శివారులోని సర్వే నం.20లో అక్రమంగా సాగు చేస్తున్న 55 గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాగు చేస్తున్న మహమ్మద్ ఖదీర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఘటనలో అరికెంపల్లి గ్రామంలో గౌండ్ల విట్టల్ గౌడ్ ఇంటిపై దాడి చేసి 150 గ్రాముల ఎండు గంజాయితో పాటు 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ డివిజన్ డిఫ్యూటీ కమిషనర్ చంద్రయ్య తెలిపారు. ఎవరైనా గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకొని, ఆ భూమికి రైతు బంధు నిలిపివేయిస్తామని హెచ్చరించారు. సీఐ సరిత ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో పాల్గొన్న ట్రైనీ ఎకై ్సజ్ సిబ్బంది అభినవ్ రెడ్డి, సరిత, హెడ్ కానిస్టేబుల్ కుమార్, ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, ఖదీర్, జ్యోతి పాల్గొన్నారు.
గంజాయి సేవించిన యువకుడిపై ..
బెజ్జంకి(సిద్దిపేట): గంజాయి సేవించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ తిరుపతి వివరాల ప్రకారం.. మండలంలోని వడ్లూరు –ఖాసీంపేట రోడ్డుపై మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కళ్యాణ్‌రెడ్డి గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిపై ఎన్‌డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరి అరెస్ట్


