తూప్రాన్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మనోరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన రైతు రాజబోయిన లక్ష్మణ్ (46) వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారును ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బావిలో పడి వ్యక్తి..
సిద్దిపేటఅర్బన్: బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ నవత వివరాల ప్రకారం... మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తరిగొప్పుల బాలరాజు (53) హైదరాబాద్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాగా పక్షవాతం రావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో వరుసకు మేనత్త అయిన అర్బన్ మండలం రుగుపల్లికి చెందిన గంగాధర భాగ్యమ్మ చనిపోవడంతో మంగళవారం అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లే సమయంలో తండ్రి చంద్రయ్య బాలరాజు కోసం వెతకగా కనిపించలేదు. అంత్యక్రియలు జరిగిన చోట వెతుకుతుండగా సమీపంలోని బావిలో బాలరాజు పడి ఉండటం చూసిన ఇద్దరు యువకులు చంద్రయ్యకు ఫోన్ చేసి చెప్పారు. బావిలో నుంచి బయటకు తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


