తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

కొమురవెళ్లి(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని అయినాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాయిత రామ్‌రెడ్డి ,చెన్నూరు భిక్షపతి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పొరుగు గ్రామాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇళ్ల తాళాలు పగులగొట్టి 3తులాల ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.60వేల నగదు, 30తులాల వెండి పట్టగొలుసులను ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం చేర్యాల సీఐ రమేశ్‌, కొమురవెళ్లి ఎస్‌ఐ మహేశ్‌ ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు.

బంగారు, వెండి ఆభరణాలు,

రూ.60వేల నగదు అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement