అగ్గి రాజుకుంటోంది | - | Sakshi
Sakshi News home page

అగ్గి రాజుకుంటోంది

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

● దగ్ధమవుతున్న పంటలు ● నష్టాల పాలవుతున్న అన్నదాతలు ● ఝరాసంగం మండల పరిధిలోని నర్సాపూర్‌ లోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో కొంతమేర సామాన్లు కాలిపోయి ఆస్తి నష్టం జరిగింది. ● ఈ నెల 26న ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు సిద్దన్న పటేల్‌ పొలం గట్టు వద్ద ఉన్న ట్రానన్స్‌ఫార్మర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాప్తి చెంది పక్కనేవున్న చెరుకు పంటకు అంటుకోవటంతో చెరుకు పంట దగ్ధమైంది. రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ● ఈ నెల 24న జహీరాబాద్‌ మండలంలోని బుర్దిపాడులో పెంటారెడ్డి మూడెకరాల విస్తీర్ణంలో చెరుకు పంటను సాగు చేస్తున్నాడు. పొలం మధ్యలో ఉన్న విద్యుత్‌ వైర్లు రాపిడి జరగడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పంటతో పాటు డ్రిప్పు పైపులు కాలిపోయి రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

వేసవికి ముందే అగ్ని ప్రమాదాలు
● దగ్ధమవుతున్న పంటలు ● నష్టాల పాలవుతున్న అన్నదాతలు

ఎల్‌నినో ప్రభావంతో వేసవి రాకముందే

ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వానాకాలం సీజన్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పచ్చదనం లేక ఎండిపోయి అటవీ ప్రాంతం కళాహీనంగా మారిపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితులు, పెరిగిన విద్యుత్‌ వినియోగం, నిర్వహణ లోపంతో జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. – సంగారెడ్డి జోన్‌

జిల్లావ్యాప్తంగా ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 405 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల ద్వారా రూ.18,54,76,411ల మేర ఆస్తికి నష్టం వాటిల్లగా రూ.65.73 కోట్లుకుపైగా ఆస్తి నష్టపోకుండా అగ్ని మాపక శాఖ అధికారులు కాపాడగలిగారు. వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. సాధారణానికి మించి ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాగులో ఉన్న పంటలు రక్షించుకునేందుకు బోరు మోటార్లను వినియోగిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఓల్టేజీ కారణంగా నిప్పురవ్వలు పడే అవకాశాలు ఉంటాయి. ఇళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్‌ తీగల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలు జరిగి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇళ్లలో ఉన్న సామాన్లు కాలిపోయి ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఇక పంటలకు సంబంధించి చెరుకు పంటల్లో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అసలే వర్షాలు లేక కొంతమేర పంట పండిన పంట చేతికొచ్చే సమయంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ఆర్థిక నష్టం తప్పటం లేదని రైతులు వాపోతున్నారు.

సిబ్బంది వచ్చేలోపే దగ్ధం

జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో ఆరు అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి కార్యాలయాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గ పరిధిలో 4 నుంచి 7 వరకు మండలాలున్నాయి. మండల పరిధిలోని ఏదో గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. కార్యాలయం నుంచి ఘటన స్థలానికి వచ్చేసరికి చాలామేర పంటలు కాలి బూడిదవుతున్నాయి. ప్రతీ మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులతోపాటు ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన పలు అగ్నిప్రమాదాలు

జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదాలు, నష్టం వివరాలు

సంవత్సరం ప్రమాదాలు నష్టం రూ.కోట్లలో కాపాడింది

2025 456 507,02,37,998 500,95,65,500

2026 405 18,54,76,411 65,73,28,124

అధికారులకు సమాచారం అందించాలి

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. పోలీసు, ఫైర్‌ అధికారులతో పాటు విద్యుత్తు తీగలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. –సందేశ్‌ కుమార్‌,

జిల్లా అగ్నిమాపక అధికారి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement