సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి
ఆహ్వానం
పటాన్‌చెరు టౌన్: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం చంద్రశేఖర్‌రావును మంగళవారం సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని కేసీఆర్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ఉన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆత్మకూర్ గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ సాయి కృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆత్మకూర్ గ్రామంలో సర్వే నంబర్ 170లో 22 ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 6.10 ఎకరాల స్థలం సేకరించిందన్నారు. ఈ స్థలంలో పేదలకు ఇళ్ల పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చినా పొజిషన్ చూపించ టం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇండ్ల స్థలాలకు పొజిషన్ చూపాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నాయకులు భూషణం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికో ఇంకుడు గుంత
డీఆర్డీఓ బాలరాజ్
కంది(సంగారెడ్డి): ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవా లని డీఆర్డీఓ బాలరాజ్ సూచించారు. మండల పరిధిలోని చేర్యాల గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎల్‌నినో వల్ల ఏర్పడే వర్షాభావంతో గ్రామాల్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదముందన్నారు. నీటి వృథాను అరికట్టడంతోపాటు భూగర్భ జలాలు పెంచుకునేందుకు చేపట్టవలసిన చర్యలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ మధులత, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ మహేందర్‌రెడ్డి, ఏపీఎం శివలక్ష్మి,గ్రామ సర్పంచ్ రేఖ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వేగంగా బ్రిడ్జి పనులు
మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు సమీపంలోని తక్కడపల్లి– గార్లపల్లి బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని బుదేరా మీదుగా రాయికోడ్ మండలం హుస్నాబాద్, కర్చల్, పిప్పడ్‌పల్లి మీదుగా సీరూర్ డబుల్ రోడ్డుకు ఈ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. మునిపల్లి మండలంలోని తక్కడపల్లి, గార్లపల్లి మధ్యన సింగూర్ ప్రాజెక్టు నీరు నిలుస్తుంది. దీనిపై బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల ప్రయాణికులు, ప్రజలకు దూరా భారం తగ్గించాలనే ఉద్దేశంతో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి జిల్లా ఖేల్ ఇండియా బాలికల ఎంపిక
హత్నూర(సంగారెడ్డి): ఉమ్మడి మెదక్ జిల్లా ఖేల్ ఇండియా బాలికల అండర్ 17 క్రీడా పోటీలలో ఎంపికను హత్నూర మండలం దౌల్తాబాద్ జెడ్పీ పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సంగీతా నర్సింహులు, ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ లు ప్రారంభించినట్లు ఖేల్ ఇండి యా జిల్లా కన్వీనర్ అంజాగౌడ్ తెలిపారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.


