వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైద్యనాథ్‌

వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైద్యనాథ్‌

జహీరాబాద్‌: వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర ఎంతో కీలకమని, వారు లేనిదే వ్యవసాయం లేదని వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైద్యనా థ్‌ పేర్కొన్నారు. మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించి న అంతర్జాతీయ మహిళా రైతు వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతాన్ని గుర్తు చేసుకుంటే ఒకప్పుడు మంచి విత్తనాలను ఎంచుకుని, వచ్చే ఏడాదికి విత్తడం కోసం దాచుకునేవారని ప్రస్తుతం డీడీఎస్‌ ఇదే విధానాన్ని ముందు కు తీసుకెళ్లడం గొప్పవిషయమని చెప్పారు. ఎల్‌ని నో ప్రభావంతో రాబోయే రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కవితాదేవి మాట్లాడుతూ డీడీఎస్‌ మహి ళా రైతులు ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయడం సంతోషకరమైన విషయమన్నారు. సేంద్రీయ విధానంలో పంటలు పడించి, వాటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిరు ధాన్యాల పంటలను మార్కెటింగ్‌ చేసుకోవాలన్నారు. డీడీఎస్‌ బోర్డు సభ్యులు రుక్మి ణీరావు మాట్లాడుతూ..ప్రభుత్వం మహిళా రైతులను గుర్తించి, వారి కోసం ప్రత్యేక చట్టం తేవాలన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్‌, ఉద్యానశాఖ అధికారి సునీత, సెర్ప్‌ సలహాదారు జమున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement