జిల్లా అదనపు న్యాయమూర్తి సతీశ్‌కుమార్
సంగారెడ్డి టౌన్: విద్యార్థులపై జరిగే నేరాలను అరికట్టాలని జిల్లా అదనపు న్యాయమూర్తి సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తు న్న సురక్షిత బచ్చన్ అభియాన్ దేశవ్యాప్త పాఠశాల అవగాహన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మండలంలోని పసల్‌వాదిలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతీ చిన్నారి హక్కులను గౌరవా న్ని కాపాడటంలో సమాజంలో ప్రతీ ఒక్కరు బాధ్య త తీసుకోవాలన్నారు. విద్యార్థులకు బాలల హక్కులు, భద్రత బాలలపై జరిగే లైంగిక వేధింపు లు, వారికి కల్పించే రక్షణపై అవగాహన కల్పించా రు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్ర తీ చిన్నారిని రక్షించేందుకు తమ వంతు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి దీప్తి, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


