న్యాల్కల్(జహీరాబాద్): మండల కేంద్రమైన న్యాల్ కల్లోని పలు పాఠశాలలకు చెందిన ముగ్గురు బాలికలు కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సంగారెడ్డిలోని అంబే డ్కర్ స్టేడియంలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 బాలికల విభాగంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. అందులో న్యాల్కల్ కేజీబీవీకి చెందిన రాథోడ్ పూజ, పవర్ సావిత్రి, జడ్పీహెచ్ఎస్కు చెందిన బాజ పవిత్ర ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయా పాఠశాలల పీడీ, పీఈటీలు తెలిపారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు లలితా, సచ్చిదానందరెడ్డి, పీడీ, పీఈటీలు పార్వతి, భూమిక, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చాలని వారు ఆకాంక్షించారు.
పూజ
సావిత్రి
పవిత్ర


