సంగారెడ్డిఎడ్యుకేషన్: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–17 బాల బాలికల వాలీబాల్ సెలెక్షన్స్ మంగళవారం దౌల్తాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఖేలో ఇండియా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంజాగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయని తెలిపారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎండీ షాజియా ఆదేశాల మేరకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికలో పాల్గొనే బాల బాలికలు ఆధార్, బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
తుపాకీతో బెదిరించి
దారి దోపిడీ
జహీరాబాద్: కోహీర్ మండలంలోని కవేలి శివారు 65వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ నరేశ్ కథనం ప్రకారం.. గ్రామ శివారులో తెల్లవారుజామున మూత్ర విసర్జన చేసేందుకు డ్రైవర్ కారును ఆపాడు. అదే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారు వద్దకు వచ్చి తుపాకీ, కత్తి చూపించారు. కారులో ఉన్న మహిళల వద్ద్ద నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును అపహరించుకుపోయారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన కిరణ్ కుటుంబసభ్యులు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెద్దశంకరంపేట(మెదక్): ధూపదీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించాలని డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరశర్మ కోరారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ విజయరామరావుకు సోమవారం సంగారెడ్డిలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేశ్వరశర్మ మాట్లాడుతూ.. అర్చక సంక్షేమ పథకాలపై గ్రామాల్లో పనిచేస్తున్న అర్చకులకు అవగాహన కల్పించాలని, ఆరోగ్యశ్రీ పథకంపై వివరించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖరశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, కోశాధికారి ప్రవీణ్‌శర్మ, సభ్యులు రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికల కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి, గుమ్మడిదల జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–14 విభాగం ఫైనల్ పోరులో న్యాల్కల్ బాలికల జట్టుపై సంగారెడ్డి జట్టు విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అండర్–17 విభాగంలో హత్నూర బాలికల జట్టుపై గుమ్మడిదల జట్టు గెలిచి విజేతగా నిలిచింది. జిల్లాలోని 28 మండలాల నుంచి సుమారు 900 మంది విద్యార్థులతో పాటు పీఈటీలు ఈ పోటీలకు హాజరైనట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
రేపు జాబ్‌మేళా
సిద్దిపేటరూరల్: నిరుద్యోగ దివ్యాంగ యువత, విద్యార్థులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈనెల 28న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికా రి ప్రియాంక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇర్కోడ్‌లోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాలో 5 కంపెనీలు పాల్గొననున్నాయని, పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళాకు హాజరుకావాలని తెలిపారు.


