ఉపాధి బాట | - | Sakshi
Sakshi News home page

ఉపాధి బాట

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

40 మంది కూలీలకు మేట్‌

● ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు చర్యలు

● వారంలో రెట్టింపైన కూలీల సంఖ్య

● పంటలు దెబ్బతినడంతో కరువైన పనులు

ఉమ్మడి జిల్లాలో ఇలా..

జిల్లా పంచాయతీలు 19వ తేదీన 26న

హాజరైన కూలీలు

సంగారెడ్డి 613 8,727 13,918

సిద్దిపేట 508 4,204 14,377

మెదక్‌ 492 9,810 19,146

నారాయణఖేడ్‌: ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు పనులు కల్పించి ఉపాధి ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పనుల నిర్ధారణ పూర్తి కాగా, గ్రామాల్లో రోజువారీగా పెరుగుతున్న కూలీల సంఖ్యకు అనుగుణంగా పనుల కల్పన చేపడుతున్నారు. వారంలో కూలీల సంఖ్య రెట్టింపు కాగా, మరో వారం పది రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ‘జీరాంజీ’ పథకం కింద సోమవారం 72 మండలాల్లోని 1,613 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనుల్లో 47,441 మంది కూలీలు హాజరయ్యారు. గత వారం క్రితం (19వ తేదీన) ఈ కూలీల సంఖ్య కేవలం 22,741 మంది మాత్రమే ఉంది. మరో వారం పది రోజుల్లో ప్రస్తుతం హాజరువుతున్న కూలీల సంఖ్య రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.

కొత్త జాబ్‌కార్డులు

గ్రామాల్లో కరువు పరస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పనులు కూడా అంతంతగానే ఉండడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లుతున్నారు. అధికారులు కూడా అందుకనుగుణంగా కూలీలకు పనులు కల్పించే ఏర్పాట్లు చేపట్టారు. వారం రోజుల్లో ఒక్కో జిల్లాలో 2 వేల మంది కొత్తవారికి జాబ్‌ కార్డులు జారీ చేశారు. యాసంగిలోనూ పంటసాగు కష్టంగా మారడంతో వారికి పనులు లభించే అవకాశాలు లేవు. దీనిని గుర్తించిన ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన కొత్త వారికి వెను వెంటనే జాబ్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

నారాయణఖేడ్‌ మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

కూలీలకు పెద్ద ఎత్తున కూలీ పనులు కల్పించేందుకు రోజ్‌గార్‌ సేవక్‌ (మేట్‌)ల నియమిస్తున్నారు. ప్రతీ 40 మంది కూలీలకు ఒకరి చొప్పున పంచాయతీల ఆధ్వర్యంలో మేట్‌లను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కూలీలను గుర్తించడం, పనులకు తీసుకెళ్లడం వంటి పనులు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వహిస్తున్నారు. దీని వల్ల చాలా మంది కూలీల గుర్తింపు, పనుల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని పంచాయతీరాజ్‌శాఖ గుర్తించింది. ఈ సమస్యను నివారించేందుకు మేట్‌ల నియామకం చేపడుతున్నారు. ఎంపికై న మేట్‌లు తమ పరిధిలో 40 మంది కూలీలకు పనులు కల్పించే బాధ్యతలను నిర్వర్తించనున్నారు. వీరందిని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షిస్తారు. ఎంపికై న మేట్‌లకు రెండు రోజుల పాటు ఉపాధి హామీ పథకం అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణకు జలసిరి పనుల్లో భాగంగా ఫాంపాండ్స్‌, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌, చెక్‌డ్యాంల నిర్మాణం, కందకాలు, వరద నివారణ కాలువలు, రాతి కట్టల నిర్మాణం తదితర పనుల చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement