కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంగీతతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తం 49 వినతులు రాగా, అందులో సంగారెడ్డి డివిజన్‌ నుంచి 9, నారాయణఖేడ్‌ నుంచి 2, జహీరాబాద్‌ నుంచి 3, కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 35 అర్జీలు వచ్చాయి. అందోల్‌ డివిజన్‌ నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అనంతరం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిపై సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌న్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement