సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వం రైతులకు నేటి వరకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయలేదని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ హరిచంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 65 లక్షల మంది ఉండగా, 25.36 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. మిగితా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరాకు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని గొప్పలు చేప్పడమే తప్ప, 24 గంటల విద్యుత్ అమ లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రాములు, బస్వరాజ్, మల్లన్న, అశోక్, అంజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


