ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 34 మంది పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు వ్యాసాలను రివార్డుల కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రజల పట్ల బాధ్యత, సేవాభావం పెంపొందించడంతో పాటు సిబ్బందిలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అలాగే విద్యార్థుల కోసం ఆన్్లైన్్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటిని పరిశీలించి ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి విజేతలకు రివార్డులు అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు.


