మునిపల్లి(అందోల్): షార్ట్ సర్క్యూట్‌తో చెరుకు పంట దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పిరంగుల రాజు చెరుకు సాగు చేస్తున్నాడు. కాగా చేను మీదుగా విద్యుత్ తీగలున్నాయి. సోమవారం షార్ట్ సర్క్యూట్‌తో సుమారు 12 టన్నుల చెరుకు పంట దగ్ధమైనట్లు బాధితుడు తెలిపారు. అధికారులు నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. విద్యుత్ తీగల ను చెరుకు తోట పైనుంచి తొలగించాలని కోరాడు.
చిన్నహైదరాబాద్ గ్రామంలో..
జహీరాబాద్ టౌన్: మండలంలోని చిన్నహైదరాబాద్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో చెరుకు తోట దగ్ధమైంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బేగరి లక్ష్మయ్య 2 ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో జరిగి చెరుకు తోటతో పాటు డ్రిప్ పైపులు, పరికరాలు కాలిపోయాయి. సుమా రు 80 టన్నుల చెరుకు కాలిపోయి రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే చెరుకుతోట అధిక భాగం మంటల్లో కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.


