ఓట్‌ చోరీపై ఢిల్లీలో గర్జన | - | Sakshi
Sakshi News home page

ఓట్‌ చోరీపై ఢిల్లీలో గర్జన

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

నారాయణఖేడ్‌: ఢిల్లీలో నవంబర్‌ 1న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు సరళ్‌ పటేల్‌, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓట్‌ బచావో పేరిట బీఎల్‌ఏలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం సాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై రాహుల్‌గాంధీ చేపట్టిన ఉద్యమానికి పార్టీశ్రేణులు మద్దతు పలకాలన్నారు. చిన్నచిన్న కారణాలతో ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారని, వారి ఓట్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్‌ చోరీ జరగకుండా రాహుల్‌గాంధీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి వెయ్యి మంది నాయకులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నోటీసులు వచ్చిన వారు సమాధానాలు సమర్పించేలా బీఎల్‌ఏలు చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ వినోద్‌ పాటిల్‌, నియోజకవర్గంలోని బీఎల్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement