యాసంగి సాగు చేయాలంటే భయంగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో సాగునీరుకు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయని, నా తోటి రైతులు అంటున్నారు. నాకు ఐదున్నర ఎకరాలు భూమి ఉంది. యాసంగిలో వరి వేయవద్దని అధికారులు చెబుతున్నారు. పొద్దుతిరుగుడు సాగు చేయాలనుకుంటున్నా. – ఐలయ్య, రైతు, రాంసాగర్, కొమురవెల్లి మండలం
కూరగాయలు సాగు చేస్తా
నాకు మొత్తం 8 ఎకరాల భూమి ఉంది. ఎల్‌నినోతో ఈ యాసంగిలో వరితో పాటు అధిక నీటి వినియోగం ఉన్న పంటలను సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. దీంతో మూడెకరాల్లో చిరు ధాన్యాలు, ఇతర పంటలు సాగు చేయాలనుకుంటున్నాను. –బొబ్బల తిరుపతిరెడ్డి, రైతు,
మాచాపూర్, చిన్నకోడూరు మండలం


