మరొకరికి తీవ్ర గాయాలు
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. చిలిపిచెడ్ మండలం సామ్ల తండాకు చెందిన మాలోత్ వినోద్(23)తో పాటు అదే తండాకు చెందిన బానోతు సర్దార్‌తో కలిసి బైక్‌పై ఆదివారం రాత్రి నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ – మెదక్ 765డి జాతీయ రహదారి పెద్ద చింతకుంట జల హనుమాన్ ఆలయం వద్ద మెదక్ నుంచి నర్సాపూర్ వైపు ఇనుప రాడ్లతో వస్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా వేగం తగ్గించడంతో వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న మాలోత్ వినోద్‌కు పలుచోట్ల రాడ్లు కుచ్చు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బైక్‌పై వెనకాల కూర్చున్న సర్దార్‌కు సైతం గాయాలయ్యాయి. వీరిని 108లో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వినోద్ మృతి చెందాడు. కాగా సర్దార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలు..
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వర్కోలు గౌరవ్వ(75) గ్రామంలోని ఆశ వర్కర్ వద్ద మందులు తీసుకోవడానికి వెళ్తుంది. ఈ క్రమంలో కేశవేణి నారాయణ తన ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా ట్రాలీ వెనుక భాగం గౌరవ్వకు తగిలి కిందపడింది. దీంతో ట్రాక్టర్ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు ఎస్‌ఐ చంద్రమోహన్ నమోదు చేశారు.
కిందపడి కాంట్రాక్టు కార్మికుడు..
జహీరాబాద్: విధులకు వెళ్లిన కాంట్రాక్టు కార్మికుడు ఆకస్మికంగా మరణించాడు. ఈ ఘటన కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నగేశ్(42) ఎప్పటి మాదిరిగానే సోమవారం గ్రామంలోని పిరామల్ కర్మాగారంలో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్తూ ఆకస్మికంగా కిందపడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నగేశ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేశారు. యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


