మద్యం మత్తులో తల్లితో గొడవపడి.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తల్లితో గొడవపడి..

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

చేగుంట(తూప్రాన్‌): మద్యం మత్తులో తల్లితో గొడవ పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన చేగుంటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టేకి నర్సింహులు(21) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా మద్యానికి బానిసగా మారిన అతడు ఆదివారం రాత్రి మద్యం మత్తులో తల్లితో గొడవపడి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని వెంచర్‌లో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదుతో మేరకు కేసు నమోదు చేశారు.

అనారోగ్యంతో వృద్ధుడు..

నంగునూరు(సిద్దిపేట): వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నంగునూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి తుకారాం (66) అనారోగ్యంతో పాటు మతిస్థిమితం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతకగా నంగునూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు..

రామాయంపేట(మెదక్‌): మండలంలోని ప్రగతి ధర్మారం అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుని మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. వివరాలు ఇలా.. చేగుంట మండల కేంద్రానికి చెందిన జలాల్‌పూర్‌ అనిల్‌కుమార్‌ (22) ఇటీవల ఇతర సామాజిక వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. కాగా ఏమైందో తెలియదు కాని రెండు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన అతడు అటవీప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. గమనించిన వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అనిల్‌ మృతి విషయమై తమకు అనుమానం ఉందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement