నర్సాపూర్ రూరల్: చిన్నారితో తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో ఆలస్యంగా సోమ వారం వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. శివ్వంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన చిట్యాల రేణుక, కుమారుడు బాన్విక్(సంవత్సరం)తో పాటు ఆడపడుచు గూడెపు సుశీలతో కలిసి నర్సాపూర్ పట్టణానికి ఆదివారం మధ్యాహ్నం షాపింగ్‌కు వచ్చారు. షాపింగ్ పూర్తి కాగానే వెంట వచ్చిన సుశీలను ఓ స్వీట్ షాప్ దగ్గర ఉండమని, వేరే పని ఉందని అని తన కుమారుడితో రేణుక వెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో సుశీల గ్రామానికి వెళ్లి విషయం చెప్పింది. రేణుక భర్త శివ కుమార్, కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
విధులకు ఆటంకం..
మహిళపై కేసు
గజ్వేల్: గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసి విధులకు ఆటంకం కలిగించిన మహిళపై కేసు నమోదైంది. ఏసీపీ నర్సింహులు కథనం ప్రకారం... రాయపోల్ మండలం సయ్యద్‌నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ బేగంబీ సోమవారం ఏసీపీని కలవడానికి వచ్చారు. ఆ సమయంలో సందర్శకులు ఉన్నందువల్ల వేచి ఉండాలని, వెయిటింగ్ హాలులో కూర్చోవాలని హోంగార్డు సూచించారు. ఈ క్రమంలో సదరు మహిళ తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు నోట్లో పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతోపాటు ప్రభుతాసుపత్రికి తరలించారు. సదరు మహిళ గతంలో తన భర్తపై నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న అధికారులను బెదిరించడానికి రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. అలాగే ఆమైపె నాలుగు న్యూసెన్స్ కేసులున్నాయి. తాజాగా ఏసీపీ కార్యాలయ హోంగార్డు ఫిర్యాదు మేరకు ఆమైపె కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.


