అనుమానంతోనే భార్య హత్య | - | Sakshi
Sakshi News home page

అనుమానంతోనే భార్య హత్య

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

● భర్త రిమాండ్‌ ● కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

● భర్త రిమాండ్‌ ● కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

జిన్నారం (పటాన్‌చెరు): భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్తను పోలీసు లు అరెస్టు చేశారు. సోమవా రం జిన్నారం సీఐ నాగార్జున గౌడ్‌ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. మెదక్‌ మండ లం ర్యాలమడుగు గ్రామానికి చెందిన సోఫీ హుస్సేన్‌, అఫ్రిన్‌ బేగం దంపతులు జీవనోపాధి కోసం మేడ్చల్‌ జిల్లాలోని గాగిల్లాపూర్‌ రాజీవ్‌గాంధీ నగర్‌ లో నివాసముంటున్నారు. భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య గడ్డపోతారంలోని ఓ పరిశ్రమ లో పనిచేస్తోంది. ఈ క్రమంలో భార్య ఇతరులతో చనువుగా ఉంటోందని హుస్సేన్‌ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై దసరా రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న హుస్సేన్‌ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు రాత్రి బయటకు వెళ్దామని భార్యను తన ద్విచక్ర వాహనంపై వావిలాల శివారు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కాగా అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాల శబ్దం వినిపించడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే భార్య మృతి చెందింది. మరుసటి రోజు తిరిగి అదే ప్రాంతా నికి చేరుకున్న హుస్సేన్‌, భార్య బతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంత రం తనపై అనుమానం రాకుండా భార్య కనిపించ డం లేదని ఆమె తల్లిదండ్రులను నమ్మించే ప్రయ త్నం చేశాడు. అలాగే, భార్య సెల్‌ఫోన్‌ను మెదక్‌ బస్టాండ్‌లో వదిలి వెళ్లి, కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే హుస్సేన్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకు ని విచారించగా, భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. కేసు నమో దు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement