గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

● చితకబాదిన గ్రామస్తులు ● సూరారంలో అర్ధరాత్రి ఉద్రిక్తత

● చితకబాదిన గ్రామస్తులు ● సూరారంలో అర్ధరాత్రి ఉద్రిక్తత

చిన్నశంకరంపేట(మెదక్‌): గుప్తనిధుల కోసం పొలం వద్ద క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన మండలంలోని సూరారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేపింది. వివరాలు ఇలా... సూరారం పెద్ద చెరువు దాటిన తరువాత నిర్మానుష్య ప్రదేశంలో గ్రామానికి చెందిన ఓ రైతు మరి కొందరితో కలిసి తన పంటపొలంలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేశారు. గమనించిన చుట్టు పక్కల రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నవారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని చితకబాదారు. గ్రామానికి చెందిన ఓ రైతుతో పాటు వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన ఒకరు, హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో గ్రామస్తులు దాడికి దిగారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా, వారు అక్కడికి వచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన నలుగురితో పాటు బొలెరొ వాహనం, రెండు స్కూటీలు, ఒక టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ శివానందం మాట్లాడుతూ.. క్షుద్రపూజల నిర్వహణపై మొత్తం 9 మందిపై ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement