పొదుపుతో కరువును జయిద్దాం | - | Sakshi
Sakshi News home page

పొదుపుతో కరువును జయిద్దాం

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

నారాయణఖేడ్‌: ఎల్‌నినో కారణంగా గ్రామాల్లో కరువు పరిస్థితులు ఎదురు కానున్నందున ప్రజలు నీటి పొదుపును పాటించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. నాగల్‌గిద్ద మండలం మావినెళ్ళి కిషన్‌ నాయక్‌ తండాలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అంతకుముందు గ్రామం, తండాలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి, ఇతర వనరుల పొదుపు పాటిస్తూ సంఘటితంగా కరువును జయిద్దామని పిలుపునిచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం దోహదపడుతుందన్నారు. గత ప్రభుత్వం కేవలం డబుల్‌బెడ్రూంల పేరిట కాలయాపన చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తుందన్నారు. పేదలకు వారికి వారి స్వగ్రామం, తండాల్లోని వారి స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తుందని గుర్తు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌రావు, మాజీ సర్పంచ్‌ మనోహర్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement