ఐడియా.. అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఐడియా.. అదుర్స్‌

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

జహీరాబాద్‌ టౌన్‌: మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవానీ మాతను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు. కిలోమీటర్ల కొద్ది కాలినడన ప్రయాణిస్తున్న వారి ఆకలి తీర్చేందుకు పలు సంఘాల నిర్వహకులు దారి పొడవునా అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే పాదయాత్రికులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు, రూట్‌ మ్యాప్‌ చూసుకునేందుకు మొబైల్‌ ఫోన్లు అత్యంత కీలకం. అయితే నిత్యం ప్రయాణంలో ఉండటం వల్ల ఫోన్లకు చార్జింగ్‌ అయిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ఇబ్బందిని గమనించిన అన్నదాన సేవా సంఘాల వారు వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశారు. ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ చుట్టూ త్రీ పిన్‌ ప్లగ్‌లను అమర్చి.. ఒకేసారి పలు డివైజ్‌లను చార్జ్‌ చేసుకునేలా ‘చార్జింగ్‌ హబ్‌’ను తయారు చేశారు. సరికొత్త ఆలోచన ద్వారా ఒకే సమయంలో డజన్ల కొద్ది భక్తులు తమ సెల్‌ఫోన్లకు చార్జ్‌ పెట్టుకునే సౌకర్యం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement