మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియా

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

చీకటి పడితే జోరుగా అక్రమ తవ్వకాలు

● చెరువులు, కుంటలు గుంతలమయం

● కాళేశ్వరం మట్టి సైతం మాయం

● పట్టించుకోని అధికారులు

నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌ చెరువు, చింతల కుంటలో సుమారు వారం రోజులుగా రాత్రి మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో చెరువు, కుంటలు గుంతలమయంగా మారాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు మట్టి వ్యాపారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మట్టిని తరలించి అమ్ముకుంటున్నారు. ఇష్టానుసారంగా తవ్వడంతో, ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువు, కుంటల్లో పశువులకు నీళ్లు తాగించడానికి వెళ్లాలంటేనే భయమేస్తుందని రైతులు, పశువుల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అధికారులు మట్టి తవ్వకాలను అడ్డుకొని, చెరువు, కుంటలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

రాత్రి అయిందంటే చాలు చెరువులు, కుంటల నుంచి యథేచ్ఛగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక మట్టి మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతోంది. వాల్టా చట్టం అమలు చేయడంలో ఆయా శాఖల అధికారులు విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం కాలువ మట్టిని సైతం మాయం చేశారని, ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

– నర్సాపూర్‌:

చర్యలు తీసుకుంటాం

హన్మంతాపూర్‌ చెరువు, చింతలకుంటలో అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న విషయం నాకు తెలియదు. రాత్రి పూట నిఘా పెట్టి, అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటాం.

– ప్రభాకర్‌, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement