శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలో గుడుంబా(నాటుసారా) తయారీపై శనివారం రాత్రి ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా.. భీమ్లా తండా పరిసరాల్లో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా నాటుసారా తయారు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 30 లీటర్ల బెల్లం పానకం, సామగ్రిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. మరో ఘటనలో అనధికారికంగా ఐఎంఎల్ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ట్రైనీ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్, సచిరథ, ఎస్ఐ శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ స్వామి, ఎకై ్సజ్ సిబ్బంది రవి, మహేశ్ కుమార్, షాహిద్, రాజశేఖర్ పాల్గొన్నారు.
కేసు నమోదు


