కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

మిరుదొడ్డి(దుబ్బాక): యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని జంగపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్‌ఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భోయ భాస్కర్‌ (31) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ భార్య రేణుక, ఏడేళ్లలోపు కూతురును పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 24న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధుమిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువు గట్టు వద్ద భాస్కర్‌ బైక్‌తో పాటు, చెప్పులు ఉండటం గ్రామస్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో చెరువులో వెతకగా భాస్కర్‌ మృతదేహం లభ్యమైంది. ఐదు నెలల క్రితం భాస్కర్‌ కుమారుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో కలత చెందిన భాస్కర్‌ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement