మండలంలోని రెడ్డిపల్లి సమీపం గుండా కాళేశ్వరం కాలువ తవ్వారు. తవ్వగా వచ్చిన మట్టిని కాలువపై కట్టగా పోశారు. కాగా పనులు నిలిచిపోవడంతో కట్టగా పోసిన మట్టిని పలువురు మట్టి వ్యాపారులు ఇష్టానుసారంగా టిప్పర్లు, ట్రాక్టర్లో తరలిస్తున్నారు. ఇటీవల రెడ్డిపల్లిలో పొలం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి అందులో ఫాం హౌస్ నిర్మాణ పనులు చేపట్టాడు. అందుకు మట్టి అవసరం పడడంతో గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకుల అండతో కాలువ మట్టిని రాత్రి ఫూట తరలించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం రాత్రి కాళేశ్వరం కాలువ నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టుకున్న టిప్పర్‌కు, మట్టి తరలించేందుకు వాడుతున్న పలు టిప్పర్లకు సరైన నంబరు ప్లేట్లు సైతం లేకపోవడం గమనార్హం. అయితే అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


