చికిత్స పొందుతూ వ్యక్తి.. | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి..

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

కొండపాక(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ వివరాల ప్రకారం.. గజ్వేల్‌ మండలంలోని సింగాటం గ్రామానికి చెందిన కుంట రాజు(40) ఈనెల 15న పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కుకునూరుపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తిప్పారం గ్రామ శివారులో మల్లన్న సాగర్‌ కాలువ వద్దకు రాగానే అడవి పందుల గుంపు ఎదురుగా రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పందులను ఢీకొట్టి కిందపడగా రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అత డ్ని అంబులెన్సులో గజ్వే ల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని యశోద ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement