గజ్వేల్: ‘అలయ్ బలయ్’ కార్యక్రమం సమైక్యతాభావాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లోని టీ–లక్ష్మణ్ గార్డెన్‌లో నిర్వహించిన శ్రీఅలయ్ బలయ్‌శ్రీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఈ కార్యక్రమం నేడు గజ్వేల్‌లో జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. దసరా తర్వాత నిర్వహించే ఈ కార్యకమ్రానికి ఎంతో ప్రత్యేకత ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడం ద్వారా ఐక్యతను చాటుకునే అవకాశముంటుందని తెలిపారు. ఈ అనవాయితీ నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగతా సమయాల్లో అంతా కలిసికట్టుగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ముందుకుసాగాల్సిన అవసరముందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేలా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరిగిందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, నాయకులు మల్లేశం, యాదగిరి, సర్దార్‌ఖాన్, సమీర్, దేవీ రవీందర్‌తోపాటు ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు రామచంద్రం, ఏ.మల్లికార్జున్, నిర్వాహణ కమిటీ బాధ్యులు కుమార్, స్వామి, నర్సింలు, శివకుమార్, మహేశ్, బాకీ స్వామి, కన్నయాదవ్ పాల్గొన్నారు.
ఈ అనవాయితీ నిరంతరం కొనసాగాలి
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి


