ఆ పరిశ్రమను మూసివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆ పరిశ్రమను మూసివేయాలి

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

చేగుంట(తూప్రాన్‌): ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన జీవిక పరిశ్రమను మూసివేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు సర్పంచుల ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీకొండాపూర్‌ సర్పంచ్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ నుంచి దుమ్ము ధూళి, పొగతో ప్రజల ఆర్యోగం దెబ్బతింటుందన్నారు. చేగుంట, అనంతసాగర్‌, ఉల్లితిమ్మాయిపల్లి, రుక్మాపూర్‌ గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, కలుషిత నీటి నివారణ, వాహనాల రాకపోకలతో ప్రమాదాల నివారణకు పరిశ్రమ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున పరిఽశ్రమను మూసివేయాలని రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు గుర్తించిన ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడేలా చొరవ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement