సిద్దిపేటజోన్: ఆత్మీయ కలయికకు వేదిక అలయ్ బల య్ అని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన అలయ్ బల య్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి పరిమితమైన అలయ్ బల య్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల, కులమతాలకతీతంగా ఇది జరగడం అభినందనీయమని చెప్పారు. మానవత్వాన్ని మించిన తత్వం లేదని మన దేశ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. విదేశాల్లో సైతం బతుకమ్మ, వినాయక చవితి, ఉగాది పండుగలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అలయ్ బల య్‌లో ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, బీఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు యాదగిరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వంశీకృష్ణను అభినందించిన
ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన దుబ్బాకకు చెందిన పల్లె వంశీకృష్ణాగౌడ్‌ను ఎంపీ రఘునందన్‌రావు సన్మానించారు. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సూచించారు.
ఎంపీ రఘునందన్‌రావు


