జహీరాబాద్ టౌన్: ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు నీటి ఎద్దడి ఏర్పడుతుండగా మరో పక్కా పల్లెల్లో తాగునీరు వృథాగా పోతుంది. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీరు వదిలినప్పుడు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. పర్యవేక్షణ లేక సింగల్ ఫేజ్ మోటార్లను కూడా ఎవరికివారే ఇష్టారాజ్యంగా ఆన్‌ఆఫ్ చేస్తున్నారు. దీంతో కూడా నీరు భారీగా వృథా అవుతుంది. రానున్న రోజుల్లో తీవ్రనీటి సమస్య ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆచరణలో మాత్రం పాటించడం లేదు. వృథాగా పోతున్న నీటి విషయాన్ని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఎందుకు గమనించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నీరు వృథా కాకుండా నల్లాలకు టాప్‌లు అమర్చాలని, సింగల్ ఫేజ్ మోటార్లు నిరంతరం నడపకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు


