రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్న సమయంలో కొల్లూరు పరిధిలోని రింగ్‌రోడ్డుపై డివైడర్‌ మధ్యలో ఉన్న మొక్కలకు జీహెచ్‌ఎంసీ నీటి ట్యాంకర్‌తో సిబ్బంది నీరు పోస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి ముత్తంగి వైపు వేగంగా వెళ్తున్న ట్రాలీ ఆటో నీటి ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొక్కలకు నీరు పోస్తున్న తెల్లాపూర్‌లో నివాసముండే, జనగామ జిల్లా గూడూరుకు చెందిన శ్రీను(30) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీ ఆటో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ శ్రీనాఽథ్‌(26) తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. కాగా మృతుడు శ్రీనాథ్‌ హైదరాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement