ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా బాక్సింగ్ టీంకు 26 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీఆర్‌సీ భవనంలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో బాక్సింగ్ పోటీలు, ఉమ్మడి మెదక్ జిల్లా టీంను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఇన్‌చార్జ్ అధికారి రమేశ్, విద్యాశాఖ ఏడీ శాస్త్రి, మెదక్ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ కృష్ణ, తెలంగాణ బాక్సింగ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ సుజాత, సిద్దిపేట జిల్లా పీఈటీ యూనియన్ సెక్రెటరీ హరికిషన్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్య, బాక్సింగ్ టెక్నికల్ అఫీషియల్స్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.


