భవనం పైనుంచి దూకి గృహిణి మృతి | - | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి దూకి గృహిణి మృతి

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

భవనం పైనుంచి దూకి గృహిణి మృతి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): అనుమానాస్పద స్థితిలో గృహిణి నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిషాకు చెందిన సరస్వతి సాహూ(23)తన భర్త దేబాషిష్‌ రౌత్‌ కలిసి మూడేళ్ల క్రితం వలస వచ్చి తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వారితో పాటు ఆమె సోదరి సావిత్రి సాహూ కూడా ఉంటున్నారు. సరస్వతి నల్లగండ్లలోని బంగారు దుకాణంలో పనిచేస్తుంది. కాగా గురువారం రాత్రి భోజన విషయంలో ఇద్దరికీ వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రాత్రి 11గంటల సమయంలో సరస్వతి మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటకు వెళ్లి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకి మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement