రాజీవ్‌ రహదారిపై అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ రహదారిపై అగ్ని ప్రమాదం

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

రాజీవ్‌ రహదారిపై అగ్ని ప్రమాదం

ములుగు(గజ్వేల్‌): ములుగులోని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సమీపంలో రాజీవ్‌ రహదారిపై శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి పోలీస్‌ సిబ్బంది కమలాకర్‌, జనార్దన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది వచ్చేవరకు మంటలు అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు చెందిన నీటి ట్యాంకర్‌ సహాయంతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. పోలీసుల తక్షణ స్పందనతో అగ్నిప్రమాదం సమీపంలోని ఎస్‌బీఐ ఏటిఎం, పక్కనే ఉన్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మామిడి తోటకు వ్యాపించే ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement